Nelson Dileep Kumar: విజయ్ సినిమాలో మహేశ్ బాబు కూడా ఉంటాడు: 'జైలర్' డైరెక్టర్

Nelson Dileep Kumar Special

  • 'జైలర్'తో హిట్ కొట్టిన నెల్సన్
  • సీక్వెల్ దిశగా జరుగుతున్న సన్నాహాలు  
  • మళ్లీ సూపర్ స్టార్స్ ను ఒక తెరపైకి చేర్చే ఆలోచన
  • నయనతార కనిపించడం ఖాయమని వెల్లడి


కోలీవుడ్ లో ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ తరువాత వినిపిస్తున్న పేరు నెల్సన్ దిలీప్ కుమార్. లోకేశ్ కనగరాజ్ విషయానికి వస్తే భారీ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇక నెల్సన్ విషయానికి వస్తే, ఆయన సినిమాలో యాక్షన్ సీన్స్  స్టైలీష్ గా ఉంటాయి. ఇద్దరి సినిమాల్లోనూ ఎమోషన్ అనేది అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా సీక్వెల్స్ పై దృష్టిపెట్టడం విశేషం. 

'జైలర్' సినిమా కోసం నెల్సన్ మలయాళం నుంచి మోహన్ లాల్ ను .. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ .. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ ను తీసుకొచ్చాడు. ఈ కాంబినేషన్ ఈ సినిమాకి హిట్ కావడంలో ప్రధానమైన పాత్రను పోషించిందనే చెప్పాలి. మళ్లీ అలాంటి ఒక ఆలోచనే నెల్సన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 

"కోలీవుడ్ లో నేను విజయ్ తో మళ్లీ ఒక సినిమా చేస్తే, అందులో మిగతా భాషలకి చెందిన స్టార్స్ తప్పకుండా ఉండేలా చూసుకుంటాను. టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు .. బాలీవుడ్ నుంచి షారుక్ .. మల్లూ ఉడ్ నుంచి మమ్ముట్టి ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఇక ఆ సినిమాలో నయనతార మాత్రం ఖాయంగా ఉంటుంది" అని చెప్పాడు.

Nelson Dileep Kumar
Mahesh Babu
Vijay
  • Loading...

More Telugu News