Buggana Rajendranath: ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ పై టీడీపీ అభ్యంతరం

TDP complains on Buggana nomination

  • ఏపీలో నిన్నటితో ముగిసిన నామినేషన్ల పర్వం
  • సోమవారం నాడు నామినేషన్ వేసిన మంత్రి బుగ్గన
  • మంత్రి బుగ్గన ఆస్తుల వివరాలు పూర్తిగా సమర్పించలేదని టీడీపీ నేతల ఆరోపణ
  • ఈ సాయంత్రంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని బుగ్గన న్యాయవాదిని కోరిన ఆర్వో

ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్నటితో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన చేపట్టారు. 

అయితే, బుగ్గన నామినేషన్ పై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ లో బుగ్గన ఆస్తి వివరాలు పూర్తిగా చూపించలేదని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. 

టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో, డోన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బుగ్గన నామినేషన్ ను పెండింగ్ లో ఉంచారు. సాయంత్రంలోగా పూర్తి ఆస్తుల వివరాలు సమర్పించాలని బుగ్గన న్యాయవాదిని ఆర్వో కోరారు.

Buggana Rajendranath
Nomination
Dhone
TDP
YSRCP
Nandyal District
  • Loading...

More Telugu News