Kakani Govardhan Reddy: ఎక్కడ మందు దొరికినా నాకే లింక్ పెడతారా?: ఏపీ మంత్రి కాకాణి ఫైర్

Kakani fires on Somireddy

  • సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న కాకాణి 
  • ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని విమర్శ
  • సంస్కారంగా మాట్లాడటాన్ని సోమిరెడ్డి అలవాటు చేసుకోవాలని సూచన

టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా తనపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో సోమిరెడ్డి ఓటమి ఖరారయిందని... అందుకే తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. మద్యం ఓ రైస్ మిల్ లో దొరికిందని... ఆ రైస్ మిల్ ఓనర్ కి, తనకు మధ్య సంబంధం ఉందని నిరూపిస్తారా? అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఎక్కడో మందు దొరికితే తనకు లింక్ పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది జనాలు వచ్చినట్టు నిరూపిస్తే తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని చెప్పారు. సోమిరెడ్డి బతుకంతా అవినీతిమయమని అన్నారు. ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని... ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. సంస్కారంగా మాట్లాడటాన్ని సోమిరెడ్డి అలవాటు చేసుకోవాలని చెప్పారు. తాను ఏం మాట్లాడాలో కూడా సోమిరెడ్డే చెపుతున్నారని విమర్శించారు.

Kakani Govardhan Reddy
YSRCP
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
  • Loading...

More Telugu News