Renu Desai: ప్యాకేజ్ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ వైరల్

Renu Desai post going viral

  • బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత గురించి రేణు దేశాయ్ పోస్ట్
  • చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ను చూశానని వ్యాఖ్య
  • ఈ కామెంట్ చేయడానికి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పొలిటికల్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాధవీలత ఫొటోను షేర్ చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశామని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్ చేశారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నానని... ఆ విషయాన్ని చెప్పానని అన్నారు. 

రేణు చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్యాకేజ్ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. పవన్ ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు తావిచ్చాయి. పవన్ ను టార్గెట్ చేస్తూనే ఆమె పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Renu Desai
Tollywood
  • Loading...

More Telugu News