YS Sharmila: చెల్లి గురించి సీఎం జగన్ ఇలా మాట్లాడారంటే సంస్కారం ఉన్నట్టా?: షర్మిల

Sharmila fires on CM Jagan

  • పులివెందుల సభలో షర్మిలపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • చెల్లెలు కట్టుకున్న చీర గురించి సభలో మాట్లాడడం ఎంత దారుణమన్న షర్మిల 
  • నిందితుడికే మళ్లీ కడప టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం 

పులివెందుల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. చెల్లెలు కట్టుకున్న చీర గురించి సీఎం జగన్ సభలో మాట్లాడడం ఎంత దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు చీర కట్టుకున్నానని, చంద్రబాబుకు మోకరిల్లుతున్నానని సీఎం హోదాలో అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 

ఇన్నాళ్లూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టాయని, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెల్లి గురించి ఇలా మాట్లాడారంటే సభ్యత, సంస్కారం ఉన్నట్టా? అని షర్మిల ప్రశ్నించారు. 

వివేకాపైనా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షర్మిల ఆరోపించారు. అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడు అంట...  మేము అవినాశ్ రెడ్డి భవిష్యత్తును నాశనం చేస్తున్నామంట అని వ్యాఖ్యానించారు.

అవినాశ్ రెడ్డి మంచివాడని నమ్ముతున్నానని జగన్ చెప్పడం అన్యాయమని అన్నారు. సీబీఐ సహా సాక్ష్యాధారాలన్నీ అవినాశ్ నిందితుడు అని చెబుతున్నాయని, నిందితుడికే మళ్లీ కడప టికెట్ ఇవ్వడం దారుణమని షర్మిల వ్యాఖ్యానించారు.

YS Sharmila
Jagan
Pulivendula
YS Avinash Reddy
Congress
YSRCP
  • Loading...

More Telugu News