deepest bore hole: ప్రపంచంలోనే లోతైన బోర్​.. ఆత్మల ఘోష తట్టుకోలేక మూసేశారట!

worlds deepest hole closed up because sounds from hell

  • రష్యాలోని కోలా ప్రాంతంలో 12.2 కిలోమీటర్ల లోతు వరకు తవ్విన బోర్ వెల్
  • భూమ్మీద మనుషులు చేసిన రంధ్రాల్లో ఇదే అతి లోతైనది
  • అంత లోతున అత్యంత వేడి వల్ల డ్రిల్లింగ్ నిలిపివేత

అది ప్రపంచంలోనే అత్యంత లోతైన బోర్ వెల్.. లోతు ఏకంగా 12 కిలోమీటర్ల 262 మీటర్లు. రష్యాలోని కోలా ప్రాంతంలో ఉంది. కానీ దానిని మూసేశారు. ఇంత లోతుగా బోర్ తవ్వడానికి, అంత లోతున తవ్వాక ఆపేయడానికి.. చివరికి మూసేయడానికి వెనుక కారణాలు కూడా చిత్రమే.

అంత లోతు బోర్ ఎందుకు తవ్వారు?
1970వ దశకం సమయంలో అమెరికా, రష్యా (అప్పటి యూఎస్ఎస్ఆర్) మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. నేనంటే నేను గొప్ప అన్నట్టుగా ప్రతి అంశంలో పోటీ సాగుతోంది. అలాంటి సమయంలో భూమిలో అత్యంత లోతు బోర్ తవ్వేందుకు రష్యా రెడీ అయింది. కేవలం పోటీ అనే కాకుండా భూమిలోపలి పొరల పరిస్థితులు, ఇతర పరిశోధనలకూ పనికొస్తుందని భావించింది. అలా ఏకంగా 12 కిలోమీటర్ల 262 మీటర్ల లోతు వరకు తవ్వింది.

ఆ లోతున ఎందుకు ఆపేశారు?
భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. అలా ఈ బోర్ వెల్ అడుగున ఏకంగా 180 డిగ్రీల ఉష్ణోగ్రత తగిలింది. బోర్ వేసే పరికరాలు దెబ్బతినడం మొదలైంది. దాంతో బోర్ వేయడం ఆపేశారు. 

మరి మూసేయడం ఎందుకు?
 బోర్ వేసిన తర్వాత కొన్నాళ్ల నుంచి ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలు అధికారులకు కంప్లైంట్లు చేయడం మొదలుపెట్టారు. నరకంలో చిత్రహింసలకు గురవుతున్న ఆత్మలు చేస్తున్న ఘోషలు, అరుపులు ఆ బోర్ నుంచి వినిపిస్తున్నట్టు చెప్పారు. అక్కడి వారు భూమి దిగువన నరకం ఉంటుందని నమ్ముతారు. అందుకే నరకం నుంచి ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని భావించారు. దీనికితోడు.. ఆ బోర్ వెల్ కు సంబంధించిన పరిశోధనలు కూడా పూర్తవడంతో.. రష్యా ఆ బోర్ వెల్ ను మూసేసింది. 
మూసివేయడం అంటే మట్టితో పూడ్చేయడం కాకుండా.. దాన్ని పైపులు అమర్చి, బోల్టులతో బిగించేసింది. దానిపైన ఓ చిన్న కట్టడాన్ని నిర్మించింది.

deepest bore hole
world news
sounds form hell
offbeat
  • Loading...

More Telugu News