Stock Market: బ్యాంకింగ్ స్టాక్స్ మద్దతు.. వరుసగా ఐదో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
- మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు
- 486 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 168 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 74,339కి చేరుకుంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,570కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (5.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.10%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.55%), నెస్లే ఇండియా (2.39%), సన్ ఫార్మా (2.30%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-10.85%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.25%), టైటాన్ (-1.05%), బజాజ్ ఫైనాన్స్ (-0.46%), మారుతి (-0.31%).