Mahesh Babu: అభిబస్ కోసం మహేశ్‌ బాబు కొత్త యాడ్‌.. నెట్టింట వీడియోల వైర‌ల్‌!

Mahesh Babu and Rajendra Prasad acted in Abhi Bus Ad

  • రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం రెండు కొత్త యాడ్స్ చేసిన ప్రిన్స్‌
  • రెండు ప్ర‌చార చిత్రాల్లోనూ కామెడీని హైలైట్ చేసిన వైనం
  • టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో అభిబస్ యాడ్‌

టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇలా ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్ర‌చార చిత్రాల్లో కూడా న‌టిస్తుంటారు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు. ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌చార చిత్రాల్లో ప్రిన్స్‌ను చూశాం. 

తాజాగా రాజేంద్రప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్‌తో అభిబస్ యాడ్ చేశారు. ఈ రెండు ప్ర‌చార చిత్రాల్లో కూడా కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. గతంలోనే ఈ ప్రచార చిత్రం తాలూకు ఓ వర్కింగ్ స్టిల్‌ను ఆయ‌న‌ షేర్ చేయ‌డం జ‌రిగింది. ప్రస్తుతం మహేశ్‌ బాబు కొత్త యాడ్స్ తాలూకు వీడియోలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.

More Telugu News