Dhanush: ధనుష్, ఐశ్వర్యలది ఫేక్ లైఫ్: నిర్మాత రాజన్

Dhanush and Aishwarya life is fake says producer Rajan

  • ఇద్దరూ నిజ జీవితంలో కూడా నటిస్తున్నారన్న రాజన్
  • వీరు కలిసి జీవించాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
  • ధనుష్ ది తప్పుంటే ఆయన మారాలని సూచన

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యల విడాకుల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఇటీవలే చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

మరోవైపు ప్రముఖ తమిళ నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ ధనుష్, ఐశ్వర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిది ఫేక్ లైఫ్ అని ఆయన ఒక్క ముక్కలో చెప్పేశారు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా నటించే జంట వీరు అని అన్నారు. 18 ఏళ్లు కాపురం చేసిన వీరు తప్పు, ఒప్పులను సరిదిద్దుకుంటూ వెళ్లాలని చెప్పారు. ఇద్దరు కొడుకుల కోసమైనా వీరిద్దరూ కలిసే జీవించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. 

ధనుష్ కు ఉన్న అఫైర్ల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని... ఒకవేళ ఇదే నిజమైతే ధనుష్ మారాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. ఇంత సూటిగా మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ... తన మనసు ఒప్పుకోలేదని, అందుకే ఈ అంశంపై మాట్లాడానని తెలిపారు.

Dhanush
Aishwarya
Kollywood
Divorce
  • Loading...

More Telugu News