Bandi Sanjay: నామినేషన్ వేసిన బండి సంజయ్.. హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి

Bandi Sanjay files nomination

  • కరీంనగర్ లోక్ సభ స్థానానికి బండి సంజయ్ నామినేషన్
  • నామినేషన్ తర్వాత భారీ ర్యాలీ
  • కరీంనగర్ లో తానే లోకల్ అన్న సంజయ్

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ వేసిన తర్వాత కరీంనగర్ లో బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్ లో తాను లోకల్ అని, బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా గుర్తు పట్టని పరిస్థితి ఉందని అన్నారు. తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ. 12 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని... నియోజకర్గ ప్రజల మద్దతు తనకే ఉందని అన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశం మొత్తం ప్రధాని మోదీ వైపు చూస్తోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు.  మరోసారి బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని కోరారు. 

Bandi Sanjay
Kishan Reddy
BJP
  • Loading...

More Telugu News