Vijay Bhaskar: 'నువ్ నాకు నచ్చావ్'లోకి ఆర్తి అగర్వాల్ అలా ఎంట్రీ ఇచ్చింది: డైరెక్టర్ విజయ్ భాస్కర్

Vijay Bhaskar Interview

  • అప్పట్లో హిట్ కొట్టిన 'నువ్ నాకు నచ్చావ్'
  • రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ 
  • కొత్తదనం కోసం ట్రై చేశామన్న విజయ్ భాస్కర్ 
  • కథలో అసలైన అంశం అదేనని వెల్లడి     


వెంకటేశ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో 'నువ్ నాకు నచ్చావ్' ఒకటి. త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన ఈ సినిమాకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

'నువ్ నాకు నచ్చావ్' సినిమాకి సంబంధించిన మాటలు జరుగుతున్న సమయంలో వేరే పనిపై నేను ముంబై వెళ్లాను. అక్కడ ఒక సినిమా ఆఫీసులో ఆర్తి అగర్వాల్ ఫొటో చూశాను. ఈ సినిమాకి ఆ అమ్మాయి అయితే కరెక్టుగా ఉంటుందని భావించాను. అలా ఆ అమ్మాయి ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. ఇక త్రివిక్రమ్ గారు .. నేను ఎప్పుడూ కూడా లెక్కలు వేసుకుని పనిచేసేవారం కాదు. ఎప్పటికప్పుడు కొత్తగా చేయడానికీ .. మా మార్కు చూపించడానికి ట్రై చేసేవాళ్లం" అని అన్నారు. 

'నువ్ నాకు నచ్చావ్' సినిమాలో హీరోను హీరోయిన్ ప్రేమిస్తున్నప్పటికీ బయటపడదు. తమ ఫ్రెండ్షిప్ ను పాడుచేయవద్దనే తండ్రి మాటకి కట్టుబడి హీరో .. ఆమెను ప్రేమిస్తున్నట్టుగా కనిపించడు. అందువలన వీళ్లిద్దరికీ ఒకరిపట్ల ఒకరికి లవ్ ఉందా లేదా అనే విషయంలో ఆడియన్స్ అయోమయంలో పడతారనే డౌట్ కొంతమందికి వచ్చింది. అలాంటి డౌట్ తోనే కథ కొంతవరకూ నడవడమే ప్రధానమైన ఉద్దేశమని నేను చెప్పాను. చివరికి నేను చెప్పింది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది" అని చెప్పారు. 

More Telugu News