IPL Match Traffic Restrictions: ఉప్పల్‌లో నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు

Traffic restrictions ipl match uppal

  • ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ ట్రాఫిక్ మళ్లింపు
  • రాచకొండ సీపీ తరుణ్ జోషి ప్రకటన

నేడు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్టేడియం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మ్యాచ్ దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. 

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు మళ్లిస్తారు. ఎల్బీనగర్, నాగోల్ మీదుగా ఉప్పల్‌కు వచ్చే వాహనాలను నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద యూటర్న్ తీసుకొని భగాయత్ లేఅవుట్ మీదుగా బోడుప్పల్, ఫీర్జాదిగూడ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్ వైపునకు మళ్లిస్తారు.

IPL Match Traffic Restrictions
IPL 2024
Uppal Stadium
Hyderabad
  • Loading...

More Telugu News