Andhra Pradesh: ఏపీలో బదిలీ చేసిన ఇద్దరు ఐపీఎస్ ల స్థానంలో నూతన నియామకాలు

EC appoints two IPS officers in AP

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్, విజయవాడ సీపీలను బదిలీ చేసిన ఈసీ
  • పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా స్థానంలో కొత్త అధికారులు
  • ఏపీ నిఘా చీఫ్ గా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్ డీ రామకృష్ణ నియామకం

ఏపీలో నిన్న ఇద్దరు ముఖ్యమైన ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో... రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను ఈసీ బదిలీ చేసింది. 

వీరిద్దరి స్థానంలో నేడు నూతన నియామకాలు చేపట్టారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్ డీ రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు (ఏప్రిల్ 25) ఉదయంలోగా బాధ్యతలు చేపట్టాలని వారిని ఆదేశించింది.

Andhra Pradesh
EC
IPS
Elections
  • Loading...

More Telugu News