Pushpa 2: ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది!

Pushpa Song Promo from Pushpa 2 The Rule

  • ఆక‌ట్టుకుంటున్న‌ 'పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌' అంటూ సాగే పవర్‌ఫుల్ సాంగ్‌
  • దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మ‌రోసారి అభిమానుల ఫిదా  
  • ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌కు మంచి స్పంద‌న‌
  • నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నం.01 ట్రెండింగ్‌లో ‘పుష్ప‌-2’ టీజ‌ర్‌

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వ‌చ్చిన ‘పుష్ప’ ది రైజ్‌ చిత్రం ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప‌-2’ ది రూల్ తెర‌కెక్కుతోంది. ఇటీవల బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ టీజర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నం.01 ట్రెండింగ్‌లో ఉండి కొత్త రికార్డు నెలకొల్పిది.

ఇక తాజాగా ‘పుష్ప-2’ ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను బుధవారం విడుదల చేసింది. 'పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌' అంటూ కొనసాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఈ ప్రొమో చూస్తే అర్థ‌మ‌వుతోంది. 

కాగా, 2021 విడుద‌లైన ‘పుష్ప’ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించింది. అలాగే బ‌న్నీకి జాతీయస్థాయి అవార్డును సైతం తెచ్చి పెట్టింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ ద రూల్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు చిత్రం యూనిట్ ఇప్ప‌టికే ప్రకటించింది.

More Telugu News