YS Sharmila: బొత్స సత్యనారాయణ మా నాన్నను తాగుబోతు అన్నారు.. జగన్ కు ఉరి వేయాలన్నారు: షర్మిల

Sharmila fires on Jagan

  • రాజకీయాల కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారన్న షర్మిల
  • వైఎస్ గురించి నీచంగా మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్నారని విమర్శ
  • జగన్ కోసం పాదయాత్ర చేసిన వాళ్లు ఆయనకు ఏమీ కారని మండిపాటు

రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక తాగుబోతు అని బొత్స సత్యనారాయణ గతంలో అన్నారని... తమ తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని విమర్శించారు. తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స... ఇప్పుడు జగన్ కు తండ్రి సమానులయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేబినెట్లో ఉన్న వాళ్లంతా గతంలో వైఎస్ ను తిట్టినవాళ్లేనని చెప్పారు. ఇదే బొత్స గతంలో జగన్ కు ఉరి వేయాలని అన్నారని తెలిపారు. 

వైఎస్ ను తిట్టిన వాళ్లకే జగన్ పెద్దపీట వేశారని షర్మిల విమర్శించారు. తమ తండ్రిని తిట్టిన వాళ్లంతా జగన్ కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అని ఎద్దేవా చేశారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లంతా ఆయనకు ఏమీ కారని అన్నారు. వైఎస్సార్ కోసం పని చేసి గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఆయనకు ఏమీ కారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేడని... వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని చెప్పారు.

YS Sharmila
Congress
Jagan
Botsa Satyanarayana
YSRCP
  • Loading...

More Telugu News