Naga Babu Konidela: పవన్‌ను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్ వైరల్

Photo Shared By Naga Babu Gone Viral

  • తన భుజంపై పవన్ చేయి ఉన్న ఫొటోను షేర్ చేసిన నాగబాబు
  • ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షలాదిమంది జనసైనికుల్లో తానూ ఒకడినని కామెంట్
  • ఆ చేయి బలాన్ని, భరోసాను ఇస్తుందన్న నాగబాబు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆయన సోదరుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భుజంపై పవన్ చేయి ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన దానికి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. 

నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో తాను కూడా ఒకడినని, ఎందుకంటే ఆ నిర్ణయం తన భుజం మీద నీ చేయిలాంటిదని పవన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. అది బలాన్ని, భరోసాను ఇస్తుందే తప్ప బరువును, బాధను ఇవ్వదని రాసుకొచ్చారు. నాగబాబు పోస్టుపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. 

ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకునే జనసేనలో.. ప్రశ్నించకుండా పాటించే లక్షణం ఉందని చెప్పడం ఏంటని కొందరు ప్రశ్నిస్తే, ఎలాంటి కండిషన్లు లేకుండా నిజమైన జనసైనికుడిలా పనిచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని మరికొందరు కామెంట్ చేశారు.

Naga Babu Konidela
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News