Sravana Bhargavi: కూతురుతో కలిసి శ్రావణ భార్గవి సమ్మర్ వెకేషన్.. హేమచంద్ర ఎక్కడంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Sravana Bhargavi Insta Post viral

  • ఇన్ స్టాలో ఫొటో షేర్ చేసిన సింగర్
  • సమ్మర్ వెకేషన్ కు వెళుతున్నట్లు వెల్లడి
  • కొంతకాలంగా పాడ్ కాస్ట్ తో బిజీబిజీగా శ్రావణ భార్గవి

ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది. అయితే, కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపించడంలేదు. సోషల్ మీడియాలోనూ విడివిడిగా ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. తాజాగా శ్రావణ భార్గవి ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో వైరల్ గా మారింది.

సమ్మర్ వెకేషన్ కు వెళుతున్నట్లు తన కూతురితో కలిసి లగేజ్ బ్యాగ్‌తో ఉన్న ఫొటోను సింగర్ షేర్ చేసింది. దీంతో హేమచంద్ర ఎక్కడంటూ అభిమానులు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. ‘హేమచంద్ర ఎక్కడ అక్కా.. మేము చంద్రను మిస్ అవుతున్నాం’ అంటూ కొంతమంది, హ్యాపీ జర్నీ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. కాగా, కొంతకాలంగా శ్రావణ భార్గవి కూతురుతో కలిసి తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతుండగా.. అటు హేమచంద్ర తన కెరీర్ లో బిజీగా గడుపుతున్నాడు.

More Telugu News