Bobby Deol: బాబీ డియోల్ కు వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ

Balakrsihna welcome Bobby Deol onboard

  • బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ 109వ చిత్రం
  • విలన్ గా బాబీ డియోల్
  • నేడు సెట్స్ పై అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు

ఇటీవల యానిమల్ చిత్రంతో తనలోని కొత్త కోణాన్ని ఘనంగా పరిచయం చేసిన నటుడు బాబీ డియోల్. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరో రోల్స్ వేసిన బాబీ డియోల్... యానిమల్ చిత్రంలో విలనిజంను పీక్స్ కు తీసుకెళ్లి ఔరా అనిపించాడు. ఇప్పుడు బాబీ డియోల్ టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. 

ఈ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా, బాబీ డియోల్ ఈ చిత్రం సెట్స్ పై అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో, బాబీ డియోల్ కు హీరో నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. "మా సినిమా సెట్స్ పైకి మీకు స్వాగతం బాబీ డియోల్ గారు. మీ తిరుగులేని నటన మా 109వ చిత్రాన్ని మరింత స్పెషల్ గా మార్చేస్తుంది. సినీ ప్రేమికులు, నా అభిమానులు మీ పెర్ఫార్మెన్స్ తో ఉర్రూతలూగిపోవడం ఖాయం" అంటూ బాలయ్య ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సెట్స్ పై దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీలతో బాబీ డియోల్ కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.

బాబీ డియోల్ కు దక్షిణాదిన ఇది మూడో సినిమా. సూర్య కంగువ, పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలోనూ బాబీ డియోల్ నటిస్తున్నాడు. కాగా, బాలయ్య 109వ చిత్రాన్ని సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. బాబీ డియోల్ సెట్స్ పై అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని... "వేటగాడు ఎంటరయ్యాడు" అంటూ ఆ రెండు ప్రొడక్షన్ సంస్థలు ట్వీట్ చేశాయి.

Bobby Deol
NBK109
Balakrishna
Bobby Kolli
Tollywood
  • Loading...

More Telugu News