Vijay Devarakonda: 'ఫామిలీ స్టార్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ .. ఫుల్ సాంగ్ చూసేయండి!

Family Star Full Song Released

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్'
  • సరైన జోడీగా అలరించిన విజయ్ దేవరకొండ - మృణాల్ 
  • సంగీతాన్ని అందించిన గోపీసుందర్ 
  • సిద్ శ్రీరామ్ తెలుగు హిట్స్ లో ఇది ఒకటి


విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మృణాళ్ ఠాకూర్ కథానాయికగా అలరించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫస్టాఫ్ లో ఒక సాంగ్ .. సెకండాఫ్ లో ఒక పాట ఆకట్టుకున్నాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి 'నందనందనా' అనే పాటను పూర్తిస్థాయిలో రిలీజ్ చేశారు. "ఏమిటిది చెప్పిచెప్పనట్టుగా ఎంత చెప్పిందో .. సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో .. " అంటూ ఈ పాట సాగుతుంది. నాయకా నాయికల మధ్య పరిచయం ప్రేమగా మారుతున్న తరుణంలో తెరపై ప్రత్యక్షమయ్యే పాట ఇది. 

అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట .. సిద్ శ్రీరామ్ స్వరంలో ప్రత్యేకతను సంతరించుకుంది. తేలికైన పదాలతో అనంత్ శ్రీరామ్ చేసిన ప్రయోగాలు మనసును పట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్ తెలుగు హిట్స్ లో ఇది ఒకటి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి మెలోడీగా ఈ పాట మంచి మార్కులు కొట్టేసింది. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ను మళ్లీ మళ్లీ వినొచ్చు.

More Telugu News