Chintha Chiguru: చికెన్‌కు రెండింతల ధర పలుకుతున్న చింతచిగురు!

Chintha Chiguru Rates On Skies

  • కిలో రూ. 500కుపైగానే చింతచిగురు
  • ఈసారి హైదరాబాద్‌లో చింతచిగురుకు కరవు
  • రైతు బజార్లలోనే 100 గ్రాములు రూ. 50
  • బయట మార్కెట్లో రూ. 80

వేసవిలో మాత్రమే వచ్చే చింతచిగురుకు ఉండే డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాదికి ఒకసారే చింతచిగురు తినే భాగ్యం నగరవాసులకు కలుగుతుంది కాబట్టి  ధరను లెక్కచేయకుండా కొంటుంటారు. అయితే, ఈసారి మాత్రం చింతచిగురు ధర ఆకాశంలో విహరిస్తోంది. చికెన్ ధరను మించి పలుకుతోంది. దీంతో దీనిని కొనుగోలుకు జనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

సాధారణంగా చింతచిగురు కిలో రూ. 200 వరకు పలుకుతుంది. అయితే, ఈసారి రూ. 500కుపైగానే పలుకుతూ గుండెలు గుభేల్‌మనిపిస్తోంది. అదే సమయంలో చికెన్ కిలో రూ. 300 లోపే పలుకుతోంది. గ్రామాల్లో విరివిగా లభించే చింతచిగురుకు ఈసారి హైదరాబాద్‌లో కొరత ఏర్పడింది. రైతుబజార్‌తోపాటు మార్కెట్లలోనూ వీటి ధర బెంబేలెత్తిస్తోంది. దీంతో వినియోగదారులు 50, 100 గ్రాములకే పరిమితమవుతున్నారు. రైతు బజార్లలో 100 గ్రాముల చింతచిగురు రూ. 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో రూ.70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు.

Chintha Chiguru
Hyderabad
Summer
Chiken
  • Loading...

More Telugu News