Mahesh Babu: సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తో మహేశ్ బాబు... బ్యూటిఫుల్ పిక్ ఇదిగో!

Mahesh Babu met Pat Cummins in Hyderabad

  • ఆర్సీబీతో ఈ నెల 25న సన్ రైజర్స్ మ్యాచ్
  • హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు
  • కమిన్స్ ను కలిసిన మహేశ్ బాబు

ఒకరు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన సక్సెస్ ఫుల్ సారథి పాట్ కమిన్స్... మరొకరు టాలీవుడ్ సూపర్ స్టార్, సామాజిక సేవల్లో మేటి మహేశ్ బాబు... తాజాగా వీరిద్దరూ కలిశారు. 

పాట్ కమిన్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ నెల 25న సన్ రైజర్స్ సొంతగడ్డ హైదరాబాదులో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఢిల్లీలో ఈ నెల 20 ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. 

ఈ సందర్భంగా పాట్ కమిన్స్ ను మహేశ్ బాబు కలిశారు. దీనిపై కమిన్స్ సోషల్ మీడియాలో స్పందించాడు. మహేశ్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ గా అభివర్ణించాడు. ఓ మధ్యాహ్నం టాలీవుడ్ యువరాజుతో గడిపాను... ఆయనను కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది అని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. 

అందుకు మహేశ్ బాబు స్పందిస్తూ, ఈ భేటీ ఒక గొప్ప గౌరవం అని పేర్కొన్నారు.

Mahesh Babu
Pat Cummins
Hyderabad
SRH
Tollywood

More Telugu News