Hanuman Movie: 100 రోజుల క్ల‌బ్‌లో 'హ‌నుమాన్‌'.. ప్ర‌శాంత్ వ‌ర్మ్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌!

Director Prashanth Varma Tweet on Hanuman Movie 100 Days Completed in 25 Centers

  • 25 సెంట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న హ‌నుమాన్ మూవీ
  • ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం
  • ఏకంగా రూ. 300 కోట్లు రాబ‌ట్టిన వైనం
  • మూవీ 100 రోజుల వేడుక‌ల‌ను థియేట‌ర్ల‌లో జ‌రుపుకోవ‌డం జీవితాంతం ఆరాధించే క్ష‌ణంగా పేర్కొన్న ప్ర‌శాంత్ వ‌ర్మ్  

ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం హ‌నుమాన్‌. తాజాగా ఈ మూవీ 100 రోజుల క్ల‌బ్‌లోకి చేరింది. అది కూడా పాతిక సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడ‌టం విశేషం. ఇక‌ చిన్న సినిమాగా విడుద‌లైన హ‌నుమాన్ పెద్ద హీరోల చిత్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఏకంగా రూ. 300 కోట్లు రాబ‌ట్టింది. తేజ స‌జ్జా హీరోగా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క‌పాత్ర‌లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఇక మూవీ వంద రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ఒక ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.  

"ఈ అద్భుత‌మైన ప్ర‌యాణంలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ఈ ఆనంద స‌మ‌యంలో మీరు చూపుతున్న ప్రేమ‌తో నా హృద‌యం నిండిపోయింది. హ‌నుమాన్ వంద రోజుల వేడుక‌ల‌ను థియేట‌ర్ల‌లో జ‌రుపుకోవ‌డం నేను జీవితాంతం ఆరాధించే క్ష‌ణం. ఈ రోజుల్లో వంద రోజుల పాటు ఒక సినిమా ఆడ‌టం చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. అలాంటిది హ‌నుమాన్‌కు ద‌క్కిన ఈ గౌర‌వం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. మాలో ఇంత‌టి సంతోషానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. నాకు ఎల్ల‌వేళ‌లా అపూర్వ‌మైన మ‌ద్ద‌తునిచ్చిన మీడియా మిత్రుల‌కు, నా టీమ్ మొత్తానికి కృత‌జ్ఞ‌త‌లు" అని ప్ర‌శాంత్ వ‌ర్మ ట్వీట్ చేశారు.

More Telugu News