Khammam Lok Sabha: బెంగళూరుకు చేరిన ఖమ్మం పంచాయితీ.. సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం

Clarity may come today on Khammam seat

  • తన సోదరుడికి టికెట్ ఇవ్వాలంటున్న పొంగులేటి
  • తన భార్యకు టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్న మల్లు భట్టి
  • ఇద్దరినీ తన వద్దకు పిలిపించుకున్న డీకే శివకుమార్

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాని సంగతి తెలిసిందే. ఖమ్మం లోక్ సభ సీటుపై పట్టుదలతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తన సోదరుదు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని ఆయన పట్టుబడుతున్నారు. 

మరోవైపు ఇదే సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా పట్టుదలతో ఉన్నారు. తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు ఈ ఖమ్మం పంచాయతీ చేరింది. మల్లు భట్టి, శ్రీనివాస్ రెడ్డిలను డీకే శివకుమార్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఖమ్మం ఎంపీ సీటుపై వారితో చర్చించనున్నారు. ఈ సాయంత్రంలోగా ఖమ్మం టికెట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Telugu News