Thiruveer: ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు ఇవిగో

Tollywood hero Triruveer marries

  • ప్రియురాలు కల్పనారావును పెళ్లాడిన తిరువీర్
  • తిరుమలలో నిన్న జరిగిన వివాహ వేడుక
  • ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తిరువీర్

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు కల్పనారావును పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తిరువీర్, కల్పనల పెళ్లి నిన్న తిరుమలలో జరిగినట్టు తెలుస్తోంది. కొత్త జీవితం ప్రారంభమయింది అంటూ తన పెళ్లి ఫొటోలను తిరువీర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.     

తిరువీర్ తొలుత నాటకాల్లో నటించారు. ఆ తర్వాత రేడియో జాకీగా పని చేశారు. 'బొమ్మలరామారం' చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏమంత్రం వేశావే, ఘాజీ, మల్లేశం, టక్ జగదీష్ తదితర సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు. జార్జ్ రెడ్డిలో నెగెటివ్ రోల్ లో నటించాడు. మసూద సినిమా కమర్షియల్ గా హిట్ కొట్టడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. పరేషన్ చిత్రంతో తిరువీర్ అందరినీ మెప్పించాడు. తిరువీర్ తాజా చిత్రాలు మోక్షపట్నం, పారాహుషార్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. హీరోగా ఒక సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు.  

Thiruveer
Tollywood
Marriage
  • Loading...

More Telugu News