Nikhil: ఆ పాత్ర గొప్పతనం అప్పుడు తెలియలేదు: 'బాహుబలి' నిఖిల్

Nikhil Interview

  • ప్రభాస్ చిన్నప్పటి పాత్ర చేసిన నిఖిల్
  • వారం రోజుల పాటు వర్క్ చేశానని వెల్లడి 
  • సెట్లో చాలా సైలెంట్ గా ఉండేదని వ్యాఖ్య 
  • ఇంతవరకూ 70 సినిమాలకి పైగా చేశానని వివరణ 


'బాహుబలి' సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను నిఖిల్ అనే కుర్రాడు చేశాడు. ఆ సినిమాలో అతనికి తేలు కుట్టినా ఓర్చుకునే సీన్ ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయింది. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడాడు .. నేను టీవీ డాన్స్ షోలలో ఎక్కువగా కనిపించేవాడిని. అలాంటి నాకు 'లవ్ లీ' సినిమాతో మొదటి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి గాను నాకు పారితోషికంగా 1000 రూపాయలు ఇచ్చారు. 

'బాహుబలి' సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈ సినిమా కోసం నేను వారం రోజుల పాటు సెట్స్ పై ఉన్నాను. నేను చేసేది ప్రభాస్ చిన్నప్పటి పాత్ర అని నాకు చెప్పారు. నేను ఎలా చెయ్యాలి? ఎంత బాగా చెయ్యాలి? అనే విషయాలపై దృష్టిపెట్టాను. ఆ సినిమాలో చేసినందుకుగాను నాకు రోజుకి 4500 ఇచ్చారు" అని అన్నాడు. 

'బాహుబలి' సెట్లో చాలామంది ఆర్టిస్టులు ఉండేవారు. అయినా చాలా సైలెంట్ గా ఉండేది. అంతమంది మధ్యలో సీన్ చేయడమనేది నాకు ఫస్టు టైమ్. రాజమౌళిగారు వచ్చేలోగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండేవాళ్లం. ఆ సినిమాకి మా చుట్టాలందరినీ తీసుకుని వెళ్లాను. తెరపై ఆ దృశ్యాలు చూస్తూ షాక్ అయ్యాను. నా పాత్రకి అంతటి ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోలేదు" అని చెప్పాడు. 

More Telugu News