Vijayasai Reddy: లోకేశ్.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: విజయసాయి రెడ్డి

Vijayasai reddy Tweet on Lokesh

  • లోకేశ్ కు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్న
  • నీకు సంస్కారం నేర్పించలేకపోయిన స్టాన్ ఫోర్డ్ ప్రొఫెసర్లు తలదించుకోవాలి..
  • నారా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, జగన్ ను హత్య చేయడానికి పదునైన రాయితో కొట్టినట్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత లోకేశ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం నేర్పించలేనందుకు చదువు చెప్పిన టీచర్లు, స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లు సిగ్గుతో తలదించుకోవాలి. జగన్ ను తాకిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు. దాడి చేయించింది విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులే’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
Stone Attack On Jagan
YSRCP
Nara Lokesh
Twitter
  • Loading...

More Telugu News