Mallu Bhatti Vikramarka: కరెంట్ పోయి దాదాపు 20 నిమిషాలు చీకట్లోనే ఉండిపోయిన భట్టివిక్రమార్క

Bhattivikramarka in darkness after power cut

  • సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమైన భట్టివిక్రమార్క
  • సమావేశమైన కాసేపటికే పోయిన కరెంట్
  • కాసేపటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన కరెంట్
  • సీపీఐ కార్యాలయంలో మాత్రం రాకపోవడంతో చీకట్లో గడిపిన నేతలు

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్న సమావేశంలో కరెంట్ పోవడంతో దాదాపు ఇరవై నిమిషాల పాటు వారు చీకట్లోనే ఉండవలసి వచ్చింది. ఆయన శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వీరు సమావేశమైన కాసేపటికే కరెంట్ పోయింది. కాసేపటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ వచ్చినప్పటికీ... సీపీఐ కార్యాలయంలో మాత్రం రాలేదు. దీంతో భట్టివిక్రమార్క సహా సీపీఐ నేతలు కాసేపు చీకట్లో గడపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Mallu Bhatti Vikramarka
Congress
Telangana
  • Loading...

More Telugu News