G Jagadish Reddy: బీఆర్ఎస్‌పై గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించిన జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy responds on Gutha Sukhendar Reddy comments

  • పార్టీ నిర్మాణంపై తాము గుత్తా సలహాలు తీసుకుంటామని వెల్లడి
  • ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు ఆయనకు బాగా తెలుసునని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల తర్వాత గుత్తా మాట్లాడిన అంశాలపై తప్పకుండా చర్చిస్తామన్న జగదీశ్ రెడ్డి

పార్టీపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ నిర్మాణంపై తాము గుత్తా సలహాలు తీసుకుంటామని తెలిపారు. ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు ఆయనకు బాగా తెలుసునని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత గుత్తా మాట్లాడిన అంశాలపై తప్పకుండా చర్చిస్తామన్నారు.

అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందన్నారు. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే బీఆర్ఎస్ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News