Chandrababu: సైబర్ టవర్స్ వద్ద ఘ‌నంగా చంద్ర‌బాబు పుట్టిన‌రోజు వేడుక‌లు

Chandrababu Birth day Celebrations at Cyber towers

  • హైద‌రాబాద్‌లో చంద్రబాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన అభిమానులు
  • హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన ఐటీ ఉద్యోగులు 
  • 'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుక‌ల‌ను ఆయ‌న అభిమానులు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. 'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు ఏపీ వ్యాప్తంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుకల‌ను ఆయ‌న అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  


Chandrababu
Birth day Celebrations
Cyber towers
Hyderabad

More Telugu News