Kanakamedala Ravindra Kumar: విజయవాడ పోలీసుల తీరుపై ఈసీకి లేఖ రాసిన కనకమేడల

Kanakamedala letter to EC

  • జగన్ పై రాయి దాడి కేసులో బొండా ఉమను ఇరికించేలా వ్యవహరిస్తున్నారన్న కనకమేడల  
  • ఎన్నికల్లో ఉమ పోటీ చేయకుండా అడ్డుకునేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపాటు
  • సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ అని కితాబు

చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ మరో లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో బొండా ఉమను ఇరికించేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్నారని లేఖలో ఆయన అన్నారు. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో బొండా ఉమ పోటీ చేయకుండా అడ్డుకునేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఢిల్లీలో కనకమేడల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ అని అన్నారు. విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని జగన్ నాశనం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ఏపీ అల్లకల్లోలమయిందని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి గెలుపును ఆపలేరని చెప్పారు.

Kanakamedala Ravindra Kumar
Chandrababu
Bonda Uma
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News