Nara Lokesh: ఏపీ సీఈవో నోటీసులకు నారా లోకేశ్ వివరణ

Nara Lokesh explanation to CEO notice

  • సైకో పోవాలి సైకిల్ రావాలి పాటపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వైసీపీ
  • నారా లోకేశ్ కు నోటీసులు
  • కోడ్ రాకముందే ఆ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారన్న లోకేశ్
  • చంద్రబాబు, పవన్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు

ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. సైకో పోవాలి సైకిల్ రావాలి పాటకు సంబంధించి వైసీపీ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఆ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని వివరణ ఇచ్చారు. 

మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేశ్ ఈ సందర్భంగా సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. భీమవరం సభలో సీఎం జగన్ ఎన్నికల నియమావళి అతిక్రమించారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నాయని కూడా లోకేశ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

Nara Lokesh
CEO
Notice
TDP
YSRCP
  • Loading...

More Telugu News