gangster: గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ అనుచరుడు ముంబైలో భారీ సంఘటనకు పాల్పడొచ్చు.. పోలీసులకు ఫోన్ కాల్

Lawrence Bishnoi man to carry out major incident in Mumbai
  • అప్రమత్తమైన ముంబై కంట్రోల్ రూం పోలీసులు
  • వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం
  • బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఇంటి నుంచి క్యాబ్ బుకింగ్
ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు ముంబైలో భారీ సంఘటనకు పాల్పడబోతున్నట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించినట్లు ముంబై పోలీసులు శనివారం తెలిపారు. బిష్ణోయ్ అనుచరుడు ముంబై వచ్చి ఆ ఘటనకు పాల్పడతాడని సదరు కాలర్ చెప్పినట్లు పోలీసులు వివరించారు. తొలుత ఈ ఫోన్ కాల్ ను అందుకున్న ముంబై పోలీస్ కంట్రోల్ రూం.. వెంటనే దీనిపై స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం అందించింది.

బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఇంటి నుంచి క్యాబ్ బుకింగ్
మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం సల్మాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్ మెంట్ నుంచి బాంద్రా పోలీసు స్టేషన్ కు ఓ యువకుడు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ సల్మాన్ ఇంటికి చేరుకొని అక్కడి వాచ్ మన్ కు కార్ బుకింగ్ గురించి చెప్పగా అతను తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే బాంద్రా పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాడు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించి అతని ద్వారా ఆన్ లైన్ లో క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తి సమాచారాన్ని ట్రాక్ చేశారు. అనంతరం దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా నిందితుడి గుట్టు బయటపడింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఆటపట్టించేందుకే నిందితుడు ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు తేలింది. నిందితుడిని యూపీలోని ఘజియాబాద్ కు చెందిన రోహిత్ త్యాగీగా గుర్తించారు. ఘజియాబాద్ లో అతన్ని అరెస్టు చేసి ముంబై తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతన్ని రెండు రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
gangster
bishnoi
Salman Khan
mumbai
threat

More Telugu News