Vasireddy Padma: చంద్రబాబు, లోకేశ్ పై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు

Vasireddy Padma fires on Chandrababu and Nara Lokesh

  • ఓటమి భయంతో హత్యా రాజకీయాలకు తెగబడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఫైర్
  • ఎలా పాలించాలో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్న
  • అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని... సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కేసులుంటేనే పదవులు వస్తాయని లోకేశ్ అంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఓటమి అంచున ఉంది కాబట్టే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో టీడీపీ హత్యా రాజకీయాలకు తెగబడుతోందని చెప్పారు. 

అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా పాలించాలో చంద్రబాబుకు తెలుసా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పాలన చేతనైతే ఐదేళ్లలో ఎందుకు ఏమీ చేయలేకపోయారని అన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని... కూటమిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచే కాకుండా టీడీపీ నేతల నుంచి కూడా స్పందన రావడం లేదని అన్నారు.

Vasireddy Padma
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News