CM Jagan: ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు... నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి: సీఎం జగన్

CM Jagan satires on Pawan Kalyan

  • కాకినాడలో మేమంతా సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • ప్యాకేజి స్టార్ కు రాష్ట్రం అంటే చులకన అని వెల్లడి
  • జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా 

రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేయగలనన్న భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ సీఎం జగన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ ప్యాకేజి స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని... జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. 

"ఇంతకుముందు ఈ ప్యాకేజి స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి... ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ ప్రాంతం ప్రేమ ఉండదు, ఈ మ్యారేజి స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనుకటికి ఒకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. 

ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు అని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడర్థమైంది. ఇదీ గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు... దాన్ని తోమి, తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజి స్టార్. 

ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుంది" అంటూ పురందేశ్వరిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇక, పిఠాపురంలో ఈసారి మన గీతమ్మను నిలబెడుతున్నామని, గీతమ్మ (వంగా గీత) తనకు అమ్మ వంటిదని సీఎం జగన్ పేర్కొన్నారు. గీతమ్మ లోకల్ హీరో అని కొనియాడారు. మీకు లోకల్ హీరో కావాలా... జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయే సినిమా హీరో కావాలా? అంటూ సీఎం ప్రజలను ప్రశ్నించారు.

CM Jagan
Pawan Kalyan
Memantha Siddham
Kakinada
YSRCP
Janasena
Chandrababu
Daggubati Purandeswari
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News