Chandrababu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: ఆలూరులో చంద్రబాబు

Chandrababu speech in Aluru

  • కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం
  • దుర్మార్గపు పాలన అంతమొందించడానికే మూడు పార్టీలు కలిశాయన్న చంద్రబాబు
  • ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని వ్యాఖ్యలు 

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మూడు పార్టీలు కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి అని చంద్రబాబు అభివర్ణించారు. 

కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, ఏపీలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. బీజేపీతో తాము జట్టు కట్టడానికి కారణం అదేనని వివరించారు. జగన్ ఐదేళ్ల పాలలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. 

అధికారం ఇస్తే అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని, వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ, జగన్ మాత్రం సంపన్నుడు అయ్యారని అన్నారు.

Chandrababu
Aluru
Praja Galam
TDP
Kurnool District
  • Loading...

More Telugu News