KCR: కేసీఆర్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

KCR bus yatra schedule confirmed

  • ఏప్రిల్ 22 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు బ‌స్సు యాత్ర 
  • త‌మ‌ ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ 
  • అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూపాల‌ని ప్ర‌ణాళిక‌

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తాజాగా ఈ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూప‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న గులాబీ పార్టీకి ఇటీవ‌ల‌ కీల‌క నేత‌లు గుడ్‌బై చెప్ప‌డం కొంత‌మేర నిరాశ‌ను మిగిల్చిందనే చెప్పాలి. అయినా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పుంజుకుంటామ‌ని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.

More Telugu News