Jogi Ramesh: జోగి రమేశ్ కు షాకిచ్చిన సొంత బామ్మర్దులు, బంధువులు

Jogi Ramesh reletives joins TDP

  • జోగి రమేశ్ ఇంటి ముందు వేదిక ఏర్పాటు చేసి టీడీపీలో చేరిక
  • ముగ్గురు బామ్మర్దులు, 40 మంది బంధువులు చేరిక
  • వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరికలు

ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. తాజాగా మంత్రి జోగి రమేశ్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. సాక్షాత్తు సొంత బామ్మర్దులు, బంధువులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ ఉదయం జోగి రమేశ్ బామ్మర్దులు పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు టీడీపీలో చేరారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జోగి రమేశ్ కు చెందిన 40 మంది బంధువర్గం టీడీపీలో చేరింది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. ఈ చేరికలపై జోగి రమేశ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News