Chilukuru Balaji Temple: చిలుకూరు ఆలయంలో సంతానప్రాప్తి దివ్య ఔషధం పంపిణీ.. మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Traffic Jam On ORR and Moinabad Root

  • తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు
  • కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలు
  • ఓఆర్ఆర్, మెయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జాం

హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సంతానప్రాప్తి దివ్య ఔషధంగా పిలిచే గరుడ ప్రసాదం పంపిణీ నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. విషయం సోషల్ మీడియా ద్వారా పాకిపోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

భక్తుల వాహనాలతో ఓఆర్ఆర్, మెయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చిలుకూరులో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 గంటలకే దాదాపు 60 వేల మందికిపైగా భక్తులు ఆలయానికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. గరుడ ప్రసాద పంపిణీ నేపథ్యంలో 5 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెప్పడంతో ఆ మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మెయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News