Lok Sabha Polls: ఓటు వేసిన ర‌జ‌నీకాంత్‌, ధ‌నుశ్‌, విజ‌య్ సేతుప‌తి

Rajinikanth Dhanush and Vijay Sethupathi vote in Chennai in Lok Sabha polls

  • చెన్నై పోయెస్ గార్డెన్‌లోని పోలింగ్ బూత్‌కు వ‌చ్చిన ర‌జ‌నీకాంత్‌
  • చెన్నైలోని టీటీకే రోడ్డు పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన‌ ధనుశ్‌ 
  • కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ విజయ్ సేతుపతి

లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి మొద‌టి ద‌శ‌ ఓటింగ్ శుక్ర‌వారం (ఏప్రిల్ 19న) ప్రారంభమైంది. త‌మిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొద‌టి ద‌శ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో త‌న‌ ఓటు వేశారు. ఇంకా నటుడు ధనుశ్ టీటీకే రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేయ‌గా, కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో విజయ్ సేతుపతి ఓటు వేశారు. 

ఓటు వేసిన అనంత‌రం రజనీకాంత్ అందరికీ అభివాదం చేస్తూ ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు తన సిరా వేలిని చూపించారు. నటుడు ధనుష్ టీటీకే రోడ్డులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఓటు వేశారు. అలాగే నటులు అజిత్ కుమార్, శివకార్తికేయన్, గౌతమ్ కార్తీక్, దర్శకులు సుందర్ సి, వెట్రి మారన్, శశికుమార్ త‌దిత‌రు‌లు కూడా ఓటు వేశారు.

More Telugu News