Rohit Sharma: ధోనీ తర్వాత ఆ ఘనత సాధించిన క్రికెటర్ గా రోహిత్ శర్మ

Rohit Sharma becomes only second player after MS Dhoni

  • ఐపీఎల్ లో 250 గేమ్స్ పూర్తి చేసుకున్న రోహిత్
  • 256 మ్యాచ్ లు ఆడిన ధోనీ
  • నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ తో రోహిత్ 250 గేమ్స్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో ఉన్నాడు. ధోనీ ఇప్పటి వరకు 256 మ్యాచ్ లు ఆడాడు. మూడో స్థానంలో దినేష్ కార్తీక్ (249 మ్యాచ్ లు), నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ (244) ఉన్నారు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 200 మ్యాచ్ లు ఆడిన వారు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. వీరందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే కావడం గమనార్హం. ఓవర్సీస్ ప్లేయర్లలో వెస్టిండీస్ కు చెందిన కీరన్ పొలార్డ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డీవిలియర్స్ (184) ఉన్నాడు. 

Rohit Sharma
MS Dhoni
IPL
  • Loading...

More Telugu News