Bellamkonda Srinivas: హారర్ టచ్ .. మిస్టరీ కోణంలో 'కిష్కిందపురి'

Bellamkonda Movie Update

  • సెట్స్ పైకి బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమా
  • విలేజ్ నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • 'కిష్కిందపురి' టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ 
  • డిఫరెంట్ జోనర్ ను టచ్ చేస్తున్న డైరెక్టర్  


బెల్లంకొండ శ్రీనివాస్ ఇక్కడ మంచి ఫామ్ లో దూసుకుపోతుండేవాడు. ఆ సమయంలో ఆయనకి బాలీవుడ్ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. 'చత్రపతి'ని హిందీలో చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ ఆ సినిమా హిట్ కాకపోగా ఇక్కడి ఆడియన్స్ తో గ్యాప్ వచ్చేసింది. దాంతో ఇక పుంజుకునే పనిలో ఉన్నాడతను. 

ఆల్రెడీ ఆయన సినిమా 'టైసన్ నాయుడు' సినిమా సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11వ సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. భారీతనమే ప్రధానంగా ఈ సినిమా నిర్మాణం జరగనుంది. 

ఈ సినిమాకి 'కిష్కిందపురి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. మిస్టరీ .. హారర్ ను కలుపుకుని ఈ కథ 'కిష్కిందపురి' అనే విలేజ్ లో నడుస్తుంది. టైటిల్ కి తగినట్టుగానే ఈ కథలో కోతుల ప్రమేయం ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర విషయాలు తెలియనున్నాయి. 

More Telugu News