KCR: ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్

KCR responds on EC legal notices

  • వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరిన కేసీఆర్
  • ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కేసీఆర్
  • గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన ఈసీ

ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజుల గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పైనా, రేవంత్ రెడ్డిపైనా చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు.

KCR
Election Commission
BRS
Congress
  • Loading...

More Telugu News