Teacher: '90s' టీమ్ నుంచి వస్తున్న మరో సిరీస్ 'టీచర్'

Teacher WebSeries

  • విశేషమైన ఆదరణ పొందిన '90s' సిరీస్ 
  • అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు 'టీచర్' 
  • తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన 'కలర్స్' స్వాతి  


ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ లలో '90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' ఒకటిగా కనిస్తుంది. శివాజీ - వాసుకి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను నవీన్ మేడారం నిర్మించగా, ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. వాస్తవానికి దగ్గరగా వెళుతూనే ఒక వైపున నవ్విస్తూ .. మరో వైపున ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సిరీస్ ఇది. 

ఇప్పుడు ఇదే టీమ్ నుంచి మరో సిరీస్ రావడానికి రెడీ అవుతోంది .. ఆ సిరీస్ పేరే 'టీచర్'. ఈ కథ కూడా తెలంగాణ నేపథ్యంలోనే నడుస్తుంది. తెలంగాణలోని 'అంకాపూర్' అనే గ్రామంలో ముగ్గురు డల్ స్టూడెంట్స్ ఉంటారు. మిగతా విషయాల్లో మాత్రం ఈ ముగ్గురిని అదుపు చేయడం చాలా కష్టమైన విషయం. అలాంటి ఈ ముగ్గురు స్టూడెంట్స్ కి ఒక టీచర్ తారసపడుతుంది.

అప్పటి నుంచి ఈ ముగ్గురు స్టూడెంట్స్ లైఫ్ లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది మిగతా కథ. స్టూడెంట్స్ గా నిఖిల్ .. నిత్యశ్రీ .. సిద్ధార్థ్ కనిపించనుండగా, టీచర్ పాత్రను 'కలర్స్' స్వాతి పోషించింది. ప్రేమ .. అభిమానం .. సరదాలు .. భావోద్వేగాలతో నడిచే ఈ సిరీస్, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Teacher
Swathi
Siddharh
Nihyasri
Nikhil
  • Loading...

More Telugu News