Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Stock market witnesses surge

  • 239.42 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 
  • 64.45 పాయింట్ల లాభంలో నిఫ్టీ 
  • లాభాల్లో ట్రేడవుతున్న బీపీసీఎల్, పవర్ గ్రిడ్, అదానీ

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 73,183 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపుతో పోలిస్తే 239.42 పాయింట్లు లేదా 0.33 శాతం ఎక్కువ. అదే విధంగా ఎన్ఎస్ ఈ నిఫ్టీ 64.45 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో  22,212 పాయింట్ల స్థాయి వద్ద మొదలైంది. సెన్సెక్స్ ఇండెక్స్ 291.27 పాయింట్లు పుంజుకొని 73,234.95 వద్ద ప్రారంభమవగా నిఫ్టీ 102.75 పాయింట్లు పెరిగి 22,250.65  పాయింట్ల వద్ద మొదలైంది. 

కంపెనీల పనితీరు
నిఫ్టీ కంపెనీల్లో 40 కంపెనీలు వృద్ధిని నమోదు చేయగా 10 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లాభపడ్డ కంపెనీల్లో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హీరో మోటోకార్ప్, అదానీ ఉన్నాయి. ఇక టాప్ లూజర్ల జాబితాలో హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి.

మార్కెట్ ట్రెండ్
21 రోజుల ఎక్స్ పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (ఈఎంఏ) ను ఇండెక్స్ దాటినా ట్రెండ్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ తెలియజేస్తోంది. అయితే అధిక విక్రయాల మద్దతుతో మార్కెట్లు సుమారు 22,000 పాయింట్ల వద్ద పుంజుకొనే అవకాశం కనిపిస్తోంది. ఆసియా ప్రాంతం మొత్తంగా ఈక్విటీల పనితీరు మిశ్రమంగా ఉంది. జపాన్ స్టాక్ లు తగ్గుతుండగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ఈక్విటీలు పుంజుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News