Raviteja: విలన్ గా మరోసారి విజృంభించనున్న జగపతిబాబు!

Mister Bchchan Movie Update

  • 'మిస్టర్ బచ్చన్'గా కనిపించనున్న రవితేజ 
  • ఆయన సరసన మెరవనున్న భాగ్యశ్రీ బోర్సే 
  • కీలకమైన పాత్రలో ఆకట్టుకోనున్న జగపతిబాబు
  • ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసిన హరీశ్


జగపతిబాబుకి విలన్ గా ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆ మధ్య చాలా పవర్ఫుల్ పాత్రలను పోషిస్తూ వచ్చిన జగపతిబాబుకి ఇటీవల కాలంలో అలాంటి రోల్స్ పడలేదనే చెప్పాలి. జగపతిబాబు చాలా డిఫరెంట్ గా కనిపించాడని ఆడియన్స్ చెప్పుకోక చాలానే రోజులైంది. అలాంటి జగపతిబాబు త్వరలోనే అభిమానుల ముచ్చట తీర్చనున్నాడని అంటున్నారు.

జగపతిబాబు కూడా కొంతకాలంగా పవర్ఫుల్ రోల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి పాత్ర ఆయనకి హరీశ్ శంకర్ ఇచ్చాడని అంటున్నారు. హరీశ్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలెట్టనున్నారు. 

ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. ఆయన పాత్ర చాలా స్టైలీష్ గా .. పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ సినిమాకి విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Raviteja
Bhagyasri Borse
Jagapathibabu
Harish Shankar
  • Loading...

More Telugu News