Kannappa: అమ్మా ప్రియాంకా... మా 'కన్నప్ప' ఫాంటసీ చిత్రం కాదు తల్లీ!: మంచు విష్ణు

Manchu Vishnu says Kannappa is not a fantasy movie

  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప
  • నిన్ననే సెట్స్ పైకి వచ్చిన అక్షయ్ కుమార్
  • టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో కవరేజి
  • కన్నప్ప ఓ ఫాంటసీ చిత్రం అంటూ పేర్కొన్న సదరు పత్రిక

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కన్నప్ప చిత్రాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ లో బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ కూడా సెట్స్ పైకి రావడంతో హైప్ మరింత పెరిగింది. 

కన్నప్ప షూటింగ్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్... మంచు విష్ణు, మోహన్ బాబులను కలిశారు. దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో కవరేజి కథనం వెలువరించారు. 

అయితే, కన్నప్ప చిత్రాన్ని ఓ ఫాంటసీ ఫిల్మ్ అని రాశారు. దీనిపై మంచు విష్ణు సున్నితంగా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సదరు ఆర్టికల్ రాసిన ప్రియాంక గౌడ్ అనే మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

"అమ్మా ప్రియాంకా... మా సినిమా గురించి మీ కవరేజికి ధన్యవాదాలు. కన్నప్ప ఓ నిజజీవిత గాథ. ఇది ఫాంటసీ చిత్రం కాదు తల్లీ. కన్నప్ప ఆ మహా శివుడి గొప్ప భక్తుల్లో ఒకడు. భారతీయులుగా మనమందరం కన్నప్ప చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని మంచు విష్ణు తన ట్వీట్  లో పేర్కొన్నారు.

Kannappa
Manchu Vishnu
True Story
Akshay Kumar
Hyderabad
Tollywood
Bollywood

More Telugu News