Nara Lokesh: జగన్ కు తన, మన అనే తేడా లేదు: నారా లోకేశ్

Nara Lokesh comments on YS Jagan

  • అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర కొనసాగుతోందన్న లోకేశ్
  • సానుభూతి కోసం బాబాయ్ ని లేపేశాడని వ్యాఖ్యలు
  • కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని వెల్లడి
  • ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని విమర్శలు 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా జగనాసుర రక్తచరిత్ర సాగుతోందని... జగన్ కు తన, మన అనే తేడా తెలియదని అన్నారు. నాడు సానుభూతితో సీఎం పీఠం దక్కించుకోవాలని బాబాయ్ ని లేపేశాడని, కోడికత్తి డ్రామాతో దళితులను బాధించాడని తెలిపారు. ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో గులకరాయి డ్రామాకి తెరలేపాడని విమర్శించారు. 

ఈసారి బీసీ బిడ్డలను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. "జగన్ నా అన్నాడంటే నాశనం చేస్తాడు... నా ఎస్సీలు అన్నాడు, వంద మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు" అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలే జగన్నాటకానికి ముగింపు పలుకుతారని లోకేశ్ స్పష్టం చేశారు.

Nara Lokesh
Jagan
Stone Attack On Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News