Meenakshi Choudary: మీనాక్షికి గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే!

Meenakshi Chaudhary Special

  • చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి 
  • 'గుంటూరు కారం'తో గ్లామరస్ గా మెరిసిన బ్యూటీ 
  • చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలు 
  • లైన్లో ఉన్న మరిన్ని ప్రాజెక్టులు


మీనాక్షి చౌదరి .. హర్యానా బ్యూటీ. చిన్న సినిమాతో  2021తో టాలీవుడ్ కి పరిచయమైంది. అప్పటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ సినిమాలు చేసుకువెళుతోంది. 'ఖిలాడీ' .. 'హిట్ 2' వంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకుకొచ్చాయి. 'గుంటూరు కారం' సినిమాలో మహేశ్ బాబు మరదలుగా మెరిసింది. అయితే ఆమె పాత్రకి ఉన్న ప్రాధాన్యత .. ప్రత్యేకత చాలా తక్కువ.అయితే మీనాక్షి చౌదరి ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. ఆమె గ్లామర్ చూసి మహేశ్ జోడీగా సాంగ్ కూడా ఉండొచ్చని అభిమానులు అనుకున్నారుగానీ, వాళ్ల ఆశలు నిరాశలయ్యాయి. ఆ సినిమాలో అలా మెరవడం వలన ఆమెకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. విజయ్ జోడీగా ఆమెకి ఛాన్స్ తగిలిందంటేనే అర్థంచేసుకోవచ్చు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే .. వరుణ్ తేజ్ సరసన 'మట్కా'  .. విష్వక్ సేన్ జోడీగా 'మెకానిక్ రాకీ' .. దుల్కర్ సల్మాన్ తో 'లక్కీ భాస్కర్' సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా సెట్స్ పై ఉన్నాయి. ఇక వెంకటేశ్ 76వ సినిమాలో నాయికగా కూడా ఆమెనే అనుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే, మీనాక్షికి కలిసొచ్చే కాలం వచ్చేసినట్టే అనిపించడం లేదూ!

Meenakshi Choudary
Actress
Vijay
Varun Tej
  • Loading...

More Telugu News