AP TS Elections: ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం.. మరింతగా పెరగనున్న పొలిటికల్ హీట్!

Nominations starts in AP and Telangana from Apr 18
  • మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలు
  • నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు
  • తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్
లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది.  

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్:
  • ఏప్రిల్ 18 - నామినేషన్ల స్వీకరణ
  • ఏప్రిల్ 25 - నామినేషన్లకు చివరి తేదీ
  • ఏప్రిల్ 26 - నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29 - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
  • మే 13 - పోలింగ్
  • జూన్ 4 - ఎన్నికల ఫలితాలు.
AP TS Elections
Nominations

More Telugu News