Family with 350 voters: ఒకే కుటుంబం.. 1200 మంది సభ్యులు.. 350 మంది ఓటర్లు!

Assam family with 350 voters goes viral during elections

  • అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలో ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో అతిపెద్ద కుటుంబం
  • కుటుంబపెద్ద దివంగత రోన్‌ బహదూర్‌కు ఐదుగురు భార్యలు, 21 మంది సంతానం
  • రోన్‌కు మనవలు, మనవరాళ్లు కలిపి మొత్తం 1,200 మంది కుటుంబసభ్యులు
  • వీరిలో 350 మందికి ఓటు హక్కు

యావత్ దేశం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అసోంలోని ఓ కుటుంబం ప్రస్తుతం వార్తల్లో పతాకశీర్షికలకు ఎక్కింది. కారణం.. ఆ కుటుంబంలో ఏకంగా 350 ఓట్లరు ఉండటమే! రాష్ట్రంలోని సోనిట్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో దివంగత రోన్ బహదూర్ తాపాకు ఐదుగురు భార్యలు. వారి ద్వారా ఆయనకు 12 మంది మగపిల్లలు, 9 మంది ఆడపిల్లలు కలిగారు. వారికి కూడా పెళ్లిళ్లై పిల్లలు కలగడంతో మొత్తం కుటుంబసభ్యుల సంఖ్య ఏకంగా 1200లకు చేరింది. 

ఆ కుటుంబంలో ప్రస్తుతం 350 మందికి ఓటు హక్కు ఉంది. వచ్చే ఎన్నికల్లో వారందరూ ఓటు వేసేందుకు రెడీ అవుతుండటంతో రాజకీయ నేతలు వారి ఇంటికి క్యూకడుతున్నారు. అసోంలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న కుటుంబాల్లో తాపా కుటుంబం కూడా ఒకటి. ఇక రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News